సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లు లో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయడు నేడు, మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వ కుట్ర ఫలితమే కందుకూరు, గుంటూరు ఘటనలని ఆరోపించారు. ఇకపై రాష్ట్రంలో సభలు, రోడ్డు షోలపై ఆంక్షలు విధించడం చూస్తే .. టీడీపీ అధినేత చంద్రబాబు అంటేనే జగన్ భయపడుతున్నాడని, ఒకవైపు చంద్రబాబు సభలకు జనాలు పోటెత్తడం.. మరోవైపు జగన్ సభలకు ఎక్కడ చుసిన ఖాళీ కుర్చీలు కనిపించడంతో రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది అనే మాట వినిపిస్తోందన్నారు. ఈ క్రమంలోనే అధికారం పోతుందనే అసహనంతో ఇటువంటి ఆంక్షలు విధిస్తున్నారన్నారని నిమ్మల పేర్కొన్నారు. జీవోలు, 30 యాక్ట్లు ప్రతిపక్షానికే వర్తిస్తాయని.. అధికార పక్షానికి వర్తించవన్నారు. రోడ్ షో చేయకూడదని ఆంక్షలు విధించిన జగన్ నేడు రాజమండ్రిలో మున్సిపల్ స్టేడియం నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకూ ఎలా రోడ్ షో నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను అణిచివేయాలనే ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఎన్ని కేసులు పెట్టినా.. ఎంతమందిని అరెస్టు చేసినా, ఎంత మందిని జైల్లో పెట్టినా లక్షలాదిమందిగా సభలకు వస్తాం, రోడ్డెక్కుతామని ప్రభుత్వానికి నిమ్మల సవాల్ విసిరారు. ( up file photo)
