సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గట్టిగ గంట వర్షం కురిస్తే హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల తో పాటు ప్రధాన రహదారుల పరిస్థితి ఏమిటో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే.. మరి అటువంటిగా గత 5 రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర ప్రజలు ,తెలంగాణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోనీ ఎక్కడికైనా వెళదామంటే ప్రధాన రోడ్స్ కాలువలను తలపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. పలు ప్రెవేటు ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. మూసీనది లో వరద ప్రవాహం పెరిగింది. హుసేన్ సాగర్ దాదాపు నిండిపోతుంది.. గత రాత్రి నుంచి నేటి గురువారం ఉదయం వరకు నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. సంపులలోవర్షపు బురద నీరు చేరి నీరు వాడకానికి పనికిరాక పలు అపార్ట్మెంట్స్ వాసులు పరిస్థితి ఘోరంగా ఉంది, జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో భారీ వర్షం పడుతోంది. ఎల్బీనగర్, సికింద్రాబాద్, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో,బోయినపల్లి, సనత్ నగర్, చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, బాలానగర్, అల్వాల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గ్రేటర్‌లో అత్యధికంగా బండ్లగూడలో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. నేడు, గురువారం స్వయంగా సీఎం కెసిఆర్ రంగంలోకి దిగి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సహాయక చర్యల కోసం డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 040-21111111, 9000113667 ఏర్పాటు చేసింది.
