సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటలు ఉన్న రైతులు కొబ్బరి ధర తో పాటు ఎగుమతులు దారుణంగా పడిపోవడం తో రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ .. కొబ్బరికి ప్రభుత్వ మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రేపు సోమవారం ఏలూరులో చలో కలెక్టరేట్ నిర్వహించనున్నారు. అక్కడ ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించనున్నరు. వివరాలలోకి వెళ్ళితే .. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉత్తరాది, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న కొబ్బరి కాయలు ఢిల్లీ క్వాలిటీ వెయ్యి కాయల ధర రూ.7 వేల 500, చిన్నకాయలు రూ.6 వేల 500, పాతకాయలు రూ.8 వేల 500, కురిడి ధర రూ.8 వేలు ఉంది. అయితే ఇక్కడి రైతులకు పోటీ గా కేరళ, తమిళనాడు ప్రాంతంలో పండించిన కొబ్బరి నాణ్యత మెరుగ్గా ఉండటంతో పాటు వారు తక్కువ రవాణా ఖర్చులతో ఉత్తరాది ప్రాంతాలకు సప్లై చేస్తుండటంతో ఆ ప్రాంత కొబ్బరికి డిమాండ్ పెరిగింది. వచ్చే శ్రావణమాసం లో కూడా రేటు పెరిగే సూచనలు లేవు.. దీనితో పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొబ్బరి ఎగుమతులకు బాగా దెబ్బ పడింది. ఇప్పటికే పాలకొల్లు, హనుమాన్ గూడెం, ద్వారకా తిరుమల రైతులు ఆందోళనలు చేపట్టారు.
