సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. పలువురు గ్రూప్‌-2 అభ్యర్థుల నుంచి వస్తోన్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ.. గ్రూప్-2 మెయిన్స్ ను రీషెడ్యూల్ చేస్తూ ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేసింది..పాత షెడ్యూల్‌ ప్రకారం 2025 జనవరి 5వ తేదీన గ్రూప్‌ -2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. 2025 ఫిబ్రవరి 23వ తేదీకి గ్రూప్ -2 మెయిన్స్‌ వాయిదా వేసినట్టు ప్రకటించింది ఏపీపీఎస్సీ.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను https://psc.ap.gov.in సందర్శించాలని పేర్కొంది గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ..గతేడాది డిసెంబర్ 7న 897 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్‌-2కు 4 లక్షల 83వేల 535 మంది అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకోగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 4 లక్షల 4 వేల 37 మంది హాజరయ్యారు. వారిలో 92 వేల 250 మంది మాత్రమే ప్రధాన పరీక్షకు అర్హత సాధించిన విషయం విదితమే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *