సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మరోసారి రుజువైంది అని నరసాపురం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. దేశంలో యువత కు ఉపాధి లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం శుభపరిణామం అని.. నేడు కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్రరాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు,నిధులు సమకూర్చడం తో పాటు , విశాఖ ఉక్కు పరిశ్రమకు ఊతం కల్పించడం, పోలవరం ప్రాజెక్టు, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల అభివృద్ధికి నిధులు, వైజాగ్ – చెన్నై & బెంగళూరు – కర్నూల్ ఇండస్ట్రియల్ కారిడార్లకు నిధులు కేటాయించామని, రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం అందించాడని కేంద్రం ముందుకు రావడం మన ప్రాంత ఆక్వా రైతులకు ప్రయోజనం కురుస్తుందని, పారిశ్రామికంగా కూడా మన ప్రాంత అభివృద్ధి కి కేంద్రం లోను, ఇక్కడ రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాల సహకారంతో నా వంతు కృషి చేస్తున్నానని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు.
