సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో పలు రాష్ట్రాలకు తాజాగా కొత్త గవర్నర్లను కేంద్రం నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కి కొత్త గవర్నర్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమించారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛతీస్ఘడ్ రాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా త్రివిక్రమ్ పట్నాయక్, జార్ఖండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్, అసోం గవర్నర్‌గా గులాబ్‌చంద్ కటారియా, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా శివప్రసాద్ శుక్లా, మణిపూర్ గవర్నర్ అనసూయ, లడఖ్ గవర్నర్‌గా బీడీ మిశ్రా, నాగాలండ్ గవర్నర్‌గా గణేషన్, మేఘాలయ గవర్నర్‌గా ఫాగు చౌహాన్, బీహార్ గవర్నర్‌గా విశ్వనాథ్ అర్లేకర్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బి.డి.మిశ్రాను నియమించారు.
