సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన భీమవరం పట్టణానికి చెందిన మేడిది జాన్సన్ కు క్రైస్తవ ప్రముఖులు రాష్ట్ర వ్యాప్తంగా శుభాబినందనాలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ని క్యాంప్ కార్యాలయంలో మేడిది జాన్సన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా శాసన మండలి చైర్మన్ మరియు DCCB ఛైర్మన్ మరియు వైసిపి ఉండి ఇంచార్జ్ PVL నర్సింహ రాజు గారు జాన్సన్ కి శుభాకాంక్షలు తెలిపారు. మిత్రులు, సౌమ్యుడు మేడిది జాన్సన్ కి సిగ్మా న్యూస్ తరపున కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాము
