సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎవరు ఊహించని రీతిలో నేడు, గురువారం ఉదయం రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ మిల్‌కు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. పేపర్ మిల్లు గేట్లకు యజమాన్యం తాళాలు వేసింది. దీంతో కార్మికులు గేటు బయటే వేచి ఉన్నారు. ఉన్నట్టుండి పేపర్ మిల్‌కు లాకౌట్ ప్రకటించారని ఆరోపిస్తూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం పేపర్ మిల్లు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏడాదికి రూ.200 కోట్లు నికర లాభాల్లో ఉన్న ఏపీ పేపరుమిల్లు యాజమాన్యం అందులో పనిచేసే 2500 మంది కార్మికుల వేతన ఒప్పందాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఏప్రిల్ 2 నుంచి కార్మికులు ఆరోపిస్తూ సమ్మెకు దిగారు. దాదాపు 23 రోజులుగా పేపర్ మిల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. కొత్త వేతన ఒప్పందం కోసం సుమారు 2,800 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే అర్థాంతరంగా పేపర్ మిల్‌కు లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు, కార్మిక సంఘాల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
