సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం రాబోయే రోజుల్లో తుఫానుగా బలపడి ఏపీలో కోస్తా జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మైచౌంగ్‌ గా నామకరణం చేసిన ఈ తుఫాను డిసెంబర్ 4 లేదా 5వ తేదీనా ఏపీ తీరానికి సమీపంగా వస్తుందని పేర్కొంది. అయితే, ఈ తుఫాను ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై ప్రస్తుతం చెప్పలేమని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను కారణంగా కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరిల్లో నేడు శుక్రవారం నుంచి సోమవారం వరకూ భారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో ఏపీ లో చెదురుమదురుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అంచనా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *