సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో వచ్చేవారం ఏర్పడే వాయుగుండం బలపడి ‘మోకా’ తుఫాన్‌గా మారే అవకాశాలున్నాయి.అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ఫై దీని ప్రభావం చాల తక్కువ ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. అనుకున్నట్లు జరిగితే తుఫాన్ మధ్య బంగాళాఖాతం మీదుగా బెంగాల్, బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల దిశగా వెళుతుందని పలు దేశాలకు చెందిన మోడల్స్ చెబుతున్నాయి. దీంతో ఏపీ, ఒడిసా తీరాలకు తుఫాన్ ముప్పు లేనట్టేనని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఈనెల 9న తుఫాన్ ఏర్పడి బంగ్లాదేశ్, మయన్మార్ తీరం దిశగా పయనించనున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు భారీగా పెరగనున్నాయి. 10నుంచి ఎండలు పెరిగి 11 నుంచి వడగాడ్పులు వీస్తాయని ఇస్రో నిపుణుడు ప్రకటించారు.
