సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ ఏడాది శీతాకాలం ఎక్కువ ప్రభావంచూపనుంది. చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గతంతో పోల్చుకొంటే ఈ మూడు నెలలు చలి ఒకింత ఎక్కువ చలిగాలుల తీవ్రత ఉండనుంది. ఈ సీజనులో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలతో పోల్చుకుంటే ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ప్రాంతాల్లోచలి ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ 3నెలలు దేశంలో శీతాకాలం ప్రభావం పై భారత వాతావరణ విభాగం (ఐఎం డీ) తాజగా అంచనాలను విడుదల చేసింది. ఈ శీతాకాలంలో ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాదితో రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కనిష్ట,గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా రికార్డవుతాయని ఒక అంచనాకు వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *