సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశం లో మారే రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో జగన్ సర్కార్ ఒకేసారి 16 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టి, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సీఎం జగన్‌ ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్యతో పాటు ముందుచూపు తో ప్రజారోగ్యానికి కూడా పెద్ద పీట వేస్తున్నారని వైద్య నిపుణులు అంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక బోధనాస్పత్రి ఉండాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ కాలేజీలకు అవసరమైన భూ సేకరణ చేసి, టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేయించారు. పలు కాలేజీల పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఒక పక్క గత 2 ఏళ్లుగా దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వైద్య, వాలంటీర్ వ్యవస్థతో కరోనా మహమ్మారితో సమర్ధవంతంగా పోరాడుతూ..ప్రజల ప్రాణాలకు పెద్దపీట వేస్తూ.. మరో ప్రక్క రాష్ట్ర ఆదాయానికి భారీగా లోటు పడినప్పటికీ తగ్గేదేలేదంటూ.. రూ.7,880 కోట్ల అంచనాలతో, 16 కాలేజీల నిర్మాణ పనులను పట్టాలెక్కించారు. పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరులో ఇప్పటికే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పునాదులను దాటి పిల్లర్ల స్థాయికి పనులు చేరుకున్నాయి. మిగతా 12 కాలేజీల పనుల ప్రారంభానికి ఆయా స్థలాలకు కాంట్రాక్టు సంస్థలు సామగ్రిని తరలిస్తున్నాయి. బాపట్ల, ఏలూరు, పాలకొల్లులలో( భీమవరం కు సరిహద్దులో 50 ఎకరాలలో నిర్మిస్తున్నారు. కోనసీమ వాసులకు అందుబాటులో ఉంటుంది. ) కాలేజీల నిర్మాణానికి భూ పరీక్షలు పూర్తయ్యాయి. ఒక్కో మెడికల్‌ కాలేజీని 35 నుంచి 60 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చేపడుతున్నారు. భూ సేకరణకు ఇప్పటికే రూ.210 కోట్లు పరిహారంగా చెల్లించారు అని సమాచారం. అన్ని మెడికల్‌ కాలేజీలతో పాటు నర్సింగ్‌ కాలేజీలను కూడా నిర్మిస్తున్నారు. అన్నింటా వచ్చే 2 ఏళ్ళు లోపు నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *