సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఎంఈఓ పోస్టుల ను కల్పిస్తూ జగన్ సర్కార్ నేడు, శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఈఓ-1 పేరిట కొత్తగా 13 పోస్టులు, ఎంఈఓ-2 పేరిట కొత్తగా 679 పోస్టును ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖలో బోధన, బోధనేతర అంశాల పర్యవేక్షణకుగానూ కొత్త పోస్టులను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న 666 ఎంఈఓ పోస్టులకు అదనంగా 13 పోస్టులను ఏర్పాటు చేసింది. ఇకపై ప్రతి మండలంలోనూ ఇద్దరు ఎంఈఓలు ఉండగా… కొత్తగా 679 ఎంఈఓ-2 పోస్టులను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న మండల విద్యాధికారి పోస్టును ఇక పై ఎంఈఓ-1గా మార్పు చేస్తూ ఆదేశించింది. సర్వీసు నిబంధనల్లో స్వల్పంగా మార్పులు చేసి ఎంఈఓ-2 గా రాష్ట్ర ప్రభుత్వం నియామకం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *