సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండ వేడిమి అటు ఎన్నికల వేడిమి పోటాపోటీగా పెరిగిపోయున్నాయి. పలు ప్రాంతాలలో ఇప్పటికే వేసవి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ఇది తీవ్ర ఇబ్బందిగా మారినప్పటికీ ఇంకా ఎన్నికలకు సమయం ఉండటంతో అభ్యర్డులు ఉదయం సాయంత్రలలో మాత్రమే ప్రచారాలు చేసుకొంటున్నారు. వాతావరణ శాఖ సమాచారము ప్రకారం నేడు, మంగళవారం రేపు బుధవారం వడగాల్పులు ఎక్కువ గా ఉంటాయని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర ఛత్తీ్‌సగఢ్‌లలో వడగాడ్పుల ప్రభావం అసాధారణంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
