సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో రేపు సోమవారం నుండి రానున్న మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. దక్షిణ, ఆగ్నేయ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, అక్కడక్కడా భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం నివేదికలో ప్రకటించింది. ప్రధానంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ఈ నివేదిక తెలిపింది. అదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమూ ఉందని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *