సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలయిన ఏపీ, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజగా ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లో 13 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వీటిలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ తేదీ ఫిబ్రవరి 16 కాగా, ఎన్నికల తేదీ మార్చి 13,ఎన్నికల ఫలితాలు తేదీ మార్చి 16 గా నిర్ణయించారు. ఏపీలో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు:1. ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు 2. కడప – అనంతపురం – కర్నూలు ఇక .. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు: 1. ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు 2. కడప- అనంతపురం- కర్నూలు 3. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం లలో ఎన్నికలు జరుగనున్నాయి.
