సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు, గురువారం ఈ నెల 1వ తేదీ కావడంతో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతోందిరాష్ట్ర ప్రభుత్వం . 62.69 లక్షల మంది వృద్దులు ఐన లబ్దిదారులకు పెన్షనర్ల నిమిత్తం రూ.1594.66 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. నేటి ఉదయం నుంచే ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 9.20 గంటల కె ఏకంగా 64.83 శాతం పెన్షన్లు పంపిణీ చేసినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తెలిపారు. 41.27 లక్షల మందికి రూ.1048.23 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆయన వెల్లడించారు. నేటి సాయంత్రానికి దాదాపు అందరి పెన్షన్ దారులకు నగదు అందనుంది.
