సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో స్థానిక పెద్దింట్లమ్మ డ్వాక్రా సంఘంకు చెందిన ‘గోల్ మాల్‘ బయట పడింది. ఆ డ్వాక్రా సంఘంలో సభ్యులకు తెలియకుండానే రూ.10.38 లక్షలు సంఘ యానిమేటర్ మహిళా .. స్వాహా చేసినట్లు అధికారులు తాజగా నేడు, బుధవారం గుర్తించారు. దీనితో అధికారులు అలర్ట్ అయ్యి అదే యానిమేటర్ పరిధిలో ఉన్నమరో 34 డ్వాక్రా సంఘాల బ్యాంకు లావాదేవీలను తనిఖీ చెయ్యగా తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు రూ.80 లక్షలకు పైగా సొమ్ము స్వాహాతో అవినీతి జరిగిందని తెలుస్తుంది. ఇంకా పూర్తీ సమాచారం రావాల్సి ఉంది. ఇదే రీతిలో ఆకివీడు సమతానగర్ లో 16 డ్వాక్రా సంఘాలకు యానిమేటర్గా ఉన్న మరోమహిళ కూడా ఇదే తరహాలో.. ఆమె బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే రూ.40 లక్షలకు పైగా అవకతవకలు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ అవకతవకలపై పూర్తీ స్టాయి విచారణకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ( up file photo)
