సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో మహిళలపై యువతులపై ఎక్కడ చుసిన అరాచకాలు ప్రబలిపోతున్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులో 7 ఏళ్ళ బాలిక ఫై 70 ఏళ్ళ వృధ్దుడు అత్యాచారం చెయ్యడం తదుపరి పోలీస్ స్టేషన్ ముందే ఆ వృద్దుడు మెడను బ్లేడుతో అందరు చూస్తుండగా కొంత మేర కోసేయ్యడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆకివీడు స్థానిక సంతమార్కెట్‌లోని పడాలవీధిలో షేక్ చిన మీరావలి (70) (మాంసం వర్తకుడు) గత సోమవారం ఆరు బయట ఆడుకుంటున్న బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మీరావలిని గత మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.బాలిక తల్లిదండ్రులు, బంధువులు,నిందితుడిని తమకు అప్పగించాలంటూ సీఐ జగదీశ్వరరావు, ఎస్‌ఐ నాగరాజుతో ఘర్షణ పడ్డారు. ఇంతలో స్టేషన్ లోపలికి వెళ్లిన బాలిక మేనమామ లాక్‌పలో ఉన్న మీరావలిపై దాడి చేసి బ్లేడ్‌తో గాయపర్చాడు. అనంతరం మీరావలిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం భీమవరం తరలించారు. డీఎస్పీ జయసూర్య ఆకివీడు ఆసుపత్రిలో మీరావలిని పరిశీలించారు. ప్రాణాపాయం లేదని వైద్యు లు తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో బాలిక మేనమామ కూడా చికిత్స పొందుతున్నాడు. డీఎస్పీ జయసూర్య పర్యవేక్షణ లో ఎస్‌ఐ పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (పీక కోస్తున్న వృద్ధుడి ఫోటోలు భయానకంగా ఉన్న దృష్ట్యా వెయ్యడం లేదు..)
