సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడులో పురాతన రామాలయ పునర్నిర్మాణంకు స్థానిక ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు పునర్ నిర్మాణానికి పూనుకోవడానికి చేస్తున్న ఏర్పాట్ల నేపథ్యంలో కొన్ని క్రైస్తవ సంఘాల నేతలకు కూటమి నేతలకు మధ్య గతంలో జరిగిన దాడుల నేపథ్యంలో, పెరిగిన ఉద్రిక్తల నేపథ్యంలో నేడు, ఆదివారంహిందూ సంఘాలు క్రైస్తవ సంఘాలు చలో ఆకివీడుకు పోటాపోటీగా పిలుపు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ పరస్పర దాడులు, ఉద్రిక్తతలు తలెత్తకుండా సుమారు 500 మంది పోలీసులు కీలక ప్రాంతాలలో మోహరించారు.ఉండి , అటు ఉప్పుటేరు నుండే వాహనాలు ను పోలీసులు అడ్డుకొంటున్నారు. నిబంధనలు అతిక్రమిస్తున్న సుమారు 100 మంది వరకు అదుపులోకి తీసుకొంటున్నారు. ఆకివీడులో ప్రస్తుతంసెక్షన్ 144 మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్అమలులో ఉన్నాయని భీమవరం డీఎస్పీ శ్రీ రఘువీర్ విష్ణు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పట్టణంలో ఎటువంటి బహిరంగ సభలు, సమావేశాలు, నిరసన ప్రదర్శనలు లేదా ర్యాలీలు నిర్వహించడానికి వీలులేదని, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడటం చట్టరీత్యా నేరమని వివరించారు. ముఖ్యంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందున, బయటి ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు ఆకివీడు పట్టణంలో ప్రవేశం లేదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *