సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సమీపంలో యువతకు సెల్ ఫోన్ ఎంతటి దారుణ వ్యసనంగా మారిందో వారు ఎంత సున్నిత మనస్సుతో ఉంటున్నారో తెలియజేసే తాజా విషాద ఘటన జరిగింది. చినకాపవరం పంచాయతీలోని దండగర్రకు చెందిన నక్కా శ్రీనివాస్, మహంకాళమ్మల కుమార్తె నందుని కుమారి(16) గత, శనివారం సెల్ఫోన్ మాట్లా డుతుండగా తరుచు ఫోన్లో ఎందుకు ఎక్కువసేపు మాట్లాడుతున్నావని తండ్రి మందలించాడు. దీంతో తీవ్ర అవమానంగా భావించి కుమార్తె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహ త్యకు పాల్పడినట్టు తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి ఇన్ఛార్జి ఎస్ఐ రాంబాబు దర్యాప్తు ప్రారంభించారు.
