సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, రాంమోహన్ నాయుడు తో కలసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి శ్రీనివాస వర్మ ఢిల్లీ నుండి తెలిపిన సమాచారం మేరకు .. పశ్చిమగోదావరి జిల్లా వాసులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నాఆకివీడు- దిగమర్రు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభమవుతాయి అని ప్రకటించారు.ఆకివీడు – దిగమర్రు ( NH – 165 ) బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తాను తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. తాను చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించి వెంటనే అధికారులకు నిధులు విడుదలపై తగు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. త్వరలోనే బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయటానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
