సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్ములూరు చినకాప వరం వద్ద కాల్వలో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. అందిన సమాచారం ప్రకారం.. రాయల చిరంజీవి (26) అనే వ్యక్తి సాయిబాబా గుడి సమీపంలోని కాలువ వద్దకు తన పిల్లలతో సహా వెళ్లాడు. వారిని వంతెనపైన ఉంచి కాల్వలోకి అమాంతంగా దూకేశాడు. దీన్ని గమనించిన స్థానికులు అతన్ని రక్షించే ప్రయత్నం చేయగా, కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఈయనకు భార్య, కుమా రుడు, కుమార్తెలు ఉన్నారు. మతిస్థిమితం లేకపోవడం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆకివీడు ఫైర్‌ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పడవలపై గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *