సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆకివీడు మండలంలోని చెరుకుమిల్లి, ఐ భీమవరం, మందపాడు, దుంపగడప గ్రామలలో నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి P.V.L నరసింహరాజుతో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమాబాల మాట్లాడుతూ.., రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమాన్ని, ప్రతి గ్రామానికి అభివృద్ధిని అందించిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత సంక్షేమ, అభివృద్ధి బాటలో నడిపించే విధంగా ఉందని తెలిపారు. అమలు జరగని మేనిఫెస్టోలను చూపించి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు కొత్త ఏం కాదని, కూటమి అభ్యర్థుల మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా నరసింహరాజు ని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. P.V.L నరసింహరాజు మాట్లాడుతూ.. ఉండి లో జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి తో, తాను జిల్లా వ్యవసాయ బ్యాంకు చైర్మెన్ గా రైతులకు అందించిన తోడ్పాటు, స్థానిక సమస్యల పరిష్కరానికి చేసిన కృషి తో పాటు టీడీపీ లోఇటీవల జరిగిన తాజా పరిణామాలుతో తాను భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *