సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంఫై ఒక ప్రక్క ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. మరో ప్రక్క పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, పెదపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణాన్ని ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో, ప్రముఖ స్థపతి డా. ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో చేపట్టనున్నామని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే, రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఈ ఆలయాన్ని శిల్పకళ, వాస్తు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం, పూర్తిగా కృష్ణ శిలతో అద్భుతంగా కనీసం 8 శతాబ్దాల పాటు చెక్కు చెదరని విధంగా త్వరలో నిర్మాణం చేపడతామని ఆ ఆలయ ప్లానింగ్ డిజెన్ ను నేడు, ఆదివారం విడుదల చేసారు.
