సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ నేటి బుధవారం సాయంత్రం . భీమవరంలోని బిజెపి నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుల చిట్ చాట్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మన ప్రాంత వాసులు సుమారు 25 సంవత్సరాలుగా అనేక అడ్డంకులు , కోర్టు కేసులు అధిగమించి .. భీమవరం బైపాస్ రోడ్డు సమస్య ఫై గత ఆరు నెలలుగా బైపాస్ రోడ్డు సమస్య పరిష్కారానికి భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుతో కలసి అధికారులతో సమావేశం అయ్యి సమస్య పరిష్కారానికి ఎట్టకేలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గట్కరి తో అధికారులతో తాను ఎన్నో సార్లు సమావేశం అయ్యానని, నేషనల్ హైవే డైరెక్టర్ జనరల్ కూడా ఢిల్లీ నుంచి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారన్నారు. మొత్తం నాలుగు కొత్త మార్గాలలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా నిర్మాణ వ్యయం, దూరం, రైల్వే క్రాసింగ్ లు లేకపోవడం వంటివి పరిగణలోకి తీసుకొని 165 జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రెండోవ ప్యాకేజీలో భాగంగా ఆకివీడు నుండి దిగమర్రు వరకు 40 కిలోమీటర్లలో ఆకివీడు నుండి వీరవాసరం వరకు 27 కిలోమీటర్ల కొత్త బైపాస్ రోడ్డుకు డిపిఆర్ సిద్ధం చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు.కొత్త బైపాస్ రోడ్ మార్గం ఆకివీడు బైపాస్ నుండి అజ్జుమూరు, చెరుకువాడ, చిన్న పుల్లేరు, పెద్ద పుల్లేరు, సీసలి, కోలనపల్లి,కోపల్లె, పెదమిరం, చినమిరం, రాయలం భీమవరం గుడిపూడి, తాడేరు, గోరగనమూడి, పెన్నాడ అగ్రహారం, శృంగవృక్షం, వీరవాసరం బ్రిడ్జ్ వరకు నిర్మాణానికి ప్రతిపాదనలు అన్ని సిద్ధమయ్యా అన్నారు.. డోన్ కెమెరాలతో సర్వే ఆధారంగా కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణానికి సుమారు 590 ఎకరాలు అవసరమవుతుందని అధికారులు అంచనా వేయటం జరిగిందన్నారు. ఈ సందర్భముగా కేంద్ర మంత్రి వర్మకు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు,బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, పాక వెంకట సత్యనారాయణ భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు స్వచ్ఛంద సంస్థ నాయకులు, బిజెపి నాయకులు పకేంద్ర మంత్రి వర్మ లువురు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *