సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భీమవరం మండలం నాగేంద్రపురం లో జరిగిన సీపీఐ మండల సమితి సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శిభీమారావు పాల్గొని మాట్లాడుతూ.. ఆక్వా రైతులు ఆరుగాలం శ్రమించి పంట చేతికందే సమయంలో ఆక్వా పరిశ్రమల యజమానులు సిండికేట్ గా మారి సామాన్య,పేద ఆక్వా రైతుల నుంచి తక్కువ ధరకు రొయ్యలు కొనుగోలు చేయడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారన్నారు.రొయ్య ప్రతీ వంద కౌంట్ కు కిలో 250 రూపాయలు మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని భీమారావు డిమాండ్ చేశారు.చంద్రబాబు ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ ఇవ్వాలని, సబ్సిడీపై మేత సరఫరా చేయాలని కోరారు.ఆక్వా పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళా కూలీలకు కనీసవేతనాలు అమలు చేయాలని దినసరి వేతనం 650 రూపాయలకు తక్కువ కాకుండా చెల్లించాలన్నారు.. వరి పండిస్తున్న రైతులకు దాళ్వా ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే సార్వాకు రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు 20 వేలు రూపాయలు తక్షణ సాయమందించాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వాలన్నారు.సీపీఐ నాయకులు ఎంవీఎన్ బ్రహ్మం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ భీమవరం మండల కార్యదర్శి ఎం.సీతారాంప్రసాద్,తిరుమాని కామేశ్వరరావు,నాగిడి తులసీరావు,నాగిడి నాగరాజు, ఎన్.శ్రీనివాస్,నాగిడి రాము, వాటాల పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
