సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మంత్రి, భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో, SEAI అధ్యక్షులు పవన్ కుమార్, సీఈవో డాక్టర్ రాఘవన్, జాతీయ కమిటీ సభ్యులు ఇర్రింకి గంగారాం, పూజితతోపాటు ఎంపీలు సానా సతీష్ బాబు, బీద మస్తాన్ రావులు నేడు, మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, నిర్మలా సీతారామన్‌ను పార్లమెంట్ లోని ఆమె కార్యాలయంలో కలిసి ఆమెకు వినతిపత్రం అందజేశారు. అమెరికా ఇటీవల విధించిన 25% సుంకం, అదనంగా ఉన్న కౌంటర్ వేలింగ్ డ్యూటీ (CVD), యాంటీ డంపింగ్ డ్యూటీల కారణంగా భారతీయ ఎగుమతిదారులు దాదాపు 35% సుంకం భారాన్ని మోయవలసి వస్తోందని SEAI ప్రతినిధులు వివరించారు. ఈ పరిణామం వల్ల భారతీయ ఎగుమతులు భారీగా తగ్గుతున్నాయని, దీని ప్రభావం 2.8 కోట్ల మంది మత్స్యకారులు, రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల కార్మికుల జీవనోపాధిపై పరోక్షంగా 25 లక్షల జీవితాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) లో మన రొయ్యలు చేపలు ఎగుమతులు $8 బిలియన్లకు కాగా. ఇందులో 25% వాటా కేవలం అమెరికా మార్కెట్‌దే అని పేర్కొన్నారు..COVID-19 సమయంలో మాదిరిగా, ఎగుమతిదారులకు వారి వర్కింగ్ క్యాపిటల్‌లో 30% వరకు తక్కువ వడ్డీతో (5% లోపు) సాఫ్ట్ లోన్లు అందించాలి అని, అన్ని రకాల సముద్ర ఆహార ఎగుమతిదారులకు 240 రోజుల పాటు ఎగుమతి సంబంధిత క్రెడిట్ సౌకర్యాలను పొడిగించాలి అని కోరారు.ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
