సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆక్వా సాధికారత కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు , వారి ఇటీవల చేసిన కృషి మేరకు రొయ్యలు పండించే రైతులకు తీపి కబురు అందింది. రొయ్యల కౌంట్ ధరలు పెంచేందుకు ప్రాసెసింగ్ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇప్పటివరకు నిర్దేశించిన రేట్లకు అదనంగా కేజీకి తూగే 20 నుంచి 55 కౌంట్ వరకు కేజీకి రూ.10 చొప్పున, 56 నుంచి 100 కౌంట్ వరకు కేజీకి రూ.5 చొప్పున ధర పెంచుతున్నట్టు ప్రకటించాయి. జగన్ సర్కార్ చొరవపై ఆక్వా రాజధాని పశ్చిమగోదావరి జిల్లా లోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి అంటే నేటి బుధవారం నుండి రానున్న పది రోజుల పాటు కొత్త ధరలు అమలులో ఉంటాయి.ప్రభుత్వం నిర్దేశిం చిన ధరల చెల్లింపులో ఏజెంట్లు, షెడ్ల నిర్వాహకులు కోత పెట్టకుండా ఎగుమతిదారులతో పాటు షెడ్ల యజమానులు, ఏజెం ట్లకు స్పష్టమైన ఆదేశాలు ను ప్రభుత్వం జారీ చేసింది.ఆదేశాలు పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇకనుండి రైతుల నుంచి కొనుగోలు చేసేవారెవరైనా కచ్చితమైన బిల్లులు ఇచ్చి కొనుగోలు చేసి తీరాల్సిం దేనని స్పష్టం చేసింది.
