సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ప్రతి ఇంటికి కేబుల్ టివి కనెక్షన్స్ బదులు ఇంటర్ నెట్ కనెక్షన్స్ పెరిగిపోవడంతో ప్రేక్షకులు బాగా తగ్గిపోయి ఓటీటీ హవా పెరిగిపోవడం తో మొదలైన నేపథ్యంలో భారీ సినిమాలు టీవీలలో వేస్తె ఆ సినిమాల టీఆర్పీ రేటింగ్‌ లు (TRP)కూడా 7 _8 దాటటం కష్టంగా ఉంది. అయితే, ఓటీటీ హవాలోనూ పుష్ప-2 కు తాజాగా బుల్లితెరపై ఈ సినిమాకు 12.6 టీఆర్పీ వచ్చింది. అయితే వెంకీ మామ ఇక్కడ థియేటర్స్ లో 300 కోట్ల పైగా కలెక్షన్ సాధించిచరిత్ర సృష్టించిన వెంకీ టివి ల రేటింగ్ లో కూడా ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్’ అంటూ లోకల్ సినిమాతో పాన్ ఇండియా హీరోలకు చెమటలు పట్టించాడు. వెంకీ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా ఏకంగా 18.1 టీఆర్పీ సాధించి షాకిచ్చింది. ఇక ఓటిటి లో 320 మిలియన్ కుటుంబాలకు చుసిన సినిమాగా రికార్డు సృష్టించింది.సుమారు థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా 1900 కోట్లు వాసులు చేసిన పుష్ప-2 తెలుగునాట టివి లలో దాన్ని ఆతెస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు, కానీ రేటింగ్స్‌లో అది సాధ్యం కాలేదు. నిజానికి తన కెరీర్ లో నటించిన సినిమాలలో 90 శాతం పైగా విజయాలు సాధించిన ఏకైక ‘పెద్దోడు’ వెంకీని మన కుర్ర హీరోలు బాగా స్టడీ చెయ్యాలని ‘చిన్నోడు’ మహేష్ బాబు ఎప్పుడో చెప్పాడు మరి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *