సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలో నూతనంగా నిర్మించనున్న “అన్న క్యాంటీన్” కు నేడు, ఆదివారం ఉదయం చిరుజల్లుల నడుమ శంకుస్థాపన చేసిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. అతి స్వల్ప ధరలకు టిఫిన్ , భోజనం పేదలకు అందాలనే లక్ష్యంతో . ఈ అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేస్తున్నామని దీని చుట్టూ చక్కని ఉద్యానవనం కూడా ఏర్పాటు చేసి వచ్చే ఆగస్ట్ 15 కల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని శ్రీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి నాగరాజు మరియు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు,
