సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ,నేడు, ఆదివారం ఉదయం ఆచంట నియోజకవర్గంలో వివిద ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయల నిధులతో ఇటీవల నిర్మించిన నూతన గ్రామ సచివాలయాలు, కమ్యూనిటీ హాల్సు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు,ను శాసనమండలి చైర్మెన్ కొయ్య మోషేను రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాలను ఆచంట శాసన సభ్యులు, మాజీ మంత్రి వర్యులు చెరుకుకువాడ శ్రీరంగనాధ రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా అతిధులుగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ , ఎమ్మెల్సీ వంకా రవీంద్ర నాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భముగా వక్తలు సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజల వద్దకే పాలనను, ప్రభుత్వ కార్యాలయాలను సచివాలయాలు తీసికొనివచ్చి ప్రజా సంక్షేమాన్ని అందిస్తున్నారని అన్నారు.
