సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నూతనంగా నిర్మించిన ఆచంట టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేడు, సోమవారం సాయంత్రం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ఆచంట శాసన సభ్యులు పితాని సత్యనారాయణ , భీమవరం శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధా కృష్ణ MLC వంకా రవీంద్ర నాథ్ MLC కవురు శ్రీనివాస్ జిల్లా SP అద్నాన్ నయీం అస్మీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తో సహా అనేక మంది భీమవరం నివాసితులు కావడం గమనార్హం. దీనితో ఆచంట భీమవరం ప్రముఖులు తో సందడి నెలకొంది. ఈ సందర్భముగా ఆచంట ప్రజలకు మరింత రక్షణ వ్యవస్థ ను, సేవలను ఈ నూతన పోలీస్ స్టేషన్ ద్వారా అందించాలని స్థానిక పోలీస్ సిబ్బంది కి జిల్లా SP అద్నాన్ నయీం అస్మీ కోరుతూ శుభాబినందనాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *