సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆటో డ్రైవర్లకు అండగా కూటమి సర్కార్ ఉంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ భరోసానిచ్చారు.నేడు, శనివారం భీమవరం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు, పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కేంద్రమంత్రి వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆటోడ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని వివరించారు. ఆటోలో తమ ప్రయాణ అనుభూతులను గుర్తు చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 8,489 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.12.73 కోట్లు జమచేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రయాణీకులు ముందుగా ఆధారపడేది ఆటోలపైనే అని కేంద్ర మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.భీమవరం పాత బస్టాండ్ నుంచి 100 ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆటో ర్యాలీను జెండా ఊపి ప్రారంభించారు, మంతెన రామరాజు ఆటోను నడపగా అందులో కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు లు ప్రయాణం చేశారు.
