సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహిస్తూ చేపట్టిన ఆడుదాం ఆంధ్ర ‘క్రీడలను నేడు, మంగళవారం ఉదయం సీఎం జగన్, గుంటూరు నల్లపాడు లయోలా ప్రాంగణానికి వెళ్లి అక్కడ ఘనంగా ప్రారంభించారు. ఆయన.. అక్కడ పలు క్రీడలను షటిల్, బాస్కెట్ బాల్ , క్రికెట్ వంటి ఆటలను ఆయనే స్వయంగా కొద్దీ సేపు ఆడి క్రీడాకారులతో ఉత్సహాన్ని నింపారు. దీనిలో భాగంగా క్రికెట్ కార్యక్రమం ప్రారంభించిన అనం తరం మైదానంలోకి అడుగుపెట్టారాయన. అక్కడ తొలుత మంత్రి ఆర్కే రోజాకు దగ్గరుండి ఎలా ఆడాలో చెప్పిన సీఎం జగన్.. ఆ తర్వాత ఆయనే ‍స్వయంగా బ్యాట్ చేతబట్టి బంతుల్ని ఎదుర్కొన్నారు. స్పోర్ట్స్ అథారటీ(శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బౌలింగ్ చేయడం గమనార్హం. దానికి ప్రతిగా సీఎం జగన్ తన క్రికెట్ అనుభవంతో చక్కటి షాట్ లు కొట్టడం మంత్రి రోజా వికెట్ కీపింగ్ చెయ్యడం వినోదాన్ని పంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *