సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఒక మీడియా ఛానెల్ లో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మరల భీమవరం నుండి పోటీ చేస్తుండటాన్ని ఆహ్వానిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు ప్రత్యర్థిగా ఎవరు పోటీ చేసిన ఆహ్వానిస్తానని, పవన్ మరోసారి పోటీ చేసిన అతడు మాములు ప్రత్యర్థిగానే తీసుకొంటాను తప్ప ఇందులో ప్రత్యకత ఏమి లేదని, తాను ప్రజల కోసం పనిచేస్తున్న మనిషి అని, cm జగన్ అండతో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేసానని ప్రజలకు ఎవరు కావాలో, వారి సమస్యలు ఎవరు తీరుస్తారో, ఎవరు అందుబాటులో ఉంటారో వారికీ తెలుస్తునని ఇప్పుడు టీడీపీ పొత్తుతో జనసేన అధినేత పవన్ పోటీ చేస్తే ప్రత్యేకంగా ఏమి జరుగుతుందని ప్రశ్నించారు. అయిన చేగువీర, జ్యోతిరావు పూలె వంటి గొప్ప నేతల ఫొటోలు పెట్టి ఇప్పుడు అవినీతిపరుడు, వెన్నుపోటు దారుడు చంద్రబాబు ను ఆ స్థాయి మనిషి అని చిత్రపటాల్లో చూపించి అతనికి జనసైనికులు జై కొట్టాలని .. టీడీపీ పొత్తు ఫై తనను ఎవరు ప్రశ్నించకూడదని ఆదేశించారని..చంద్రబాబు ను నమ్మని జనసైనికులు ఎవరైనా సరే వైసీపీ కొవార్డులే.. నాతో పాటు మీరు చంద్రబాబు ను కొలవాలి.. లేకపోతే వైసిపి లోకి పోండి .. అని పవన్ ప్రకటించారని అందుకే జనసేన లో నిబద్దతతో పనిచేసిన, ఆత్మాభిమానం ఉన్న క్యాడర్ కు ఆహ్వానం పలుకుతున్నా.. టీడీపీ ఫై పొత్తు ఫై మీ నాయకుడిని ప్రశ్నించలేని మీరు మీ నాయకుడు ఆదేశించినట్లు వైసిపి లో చేరిపోండి. ప్రజా సేవకు అంకితం కండి అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *