సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:విక్టరీ వెంకటేష్ హీరోగా ‘భీమవరం బ్రాండ్’ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ AK 47 (House No: 47) శరవేగంగా షూటింగ్ పూర్తీ చేసిజూన్ నెలలో విడుదల చెయ్యాలని భావించినప్పటికీ షూటింగ్ కు అంతరాయంఏర్పడిన కారణంగా ఈ సినిమా దసరా సీజన్లో అక్టోబర్ 2నప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల సినిమా షూటింగ్ దుబాయ్లో కూడా చేయాలని యూనిట్ అనుకున్నప్పటికీ, గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా షెడ్యూల్లో కొన్ని మార్పులు చేయవలసి వస్తోంది.ఈ సినిమాలో KGF శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే తమిళ కామెడీ నటుడు యోగి బాబు కూడా ముఖ్య పాత్రలో నటిస్తాడు. ఇప్పటి వరకు సినిమా 50% పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. వెంకీ మార్క్ కామెడీ,మల్లేశ్వరి తరహా భారీ యాక్షన్, ట్విస్టులు, మలుపులుఉంటాయి.
