సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 ఏళ్లుగా సంచలన రీతిలో ఎదిగిపోయిన అదానీ గ్రూప్ స్టాక్స్ షేర్ హోల్డర్స్ ను లాభాల్లో ముం చెత్తాయి. అయితే ఈ లాభాల విజయ యాత్రకు గత బుధవారం భారీ బ్రేక్ పడింది. షేర్ల విలువలు పెంచడంలో అదానీ గ్రూప్ అనేక అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్బర్గ్ సంచలన ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలు ఒక్కసారిగా గత బుధవారమే రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. అయితే నివేదికలో పేర్కొన్న అంశాలను గౌతమ్ అదానీ నేతృ త్వం లోని అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. తమ షేర్ల విలువలపై ప్రతికూల ప్రభావం పడేలా, నివేదికలో నిరాధార అంశాలను పొందుపరిచారని అదానీ గ్రూప్ లీడ్ హెడ్జతిన్ జలుం ధ్వాలా తెలిపారు. దీనిపై భారత, అమెరికా చట్టాల ప్రకారం హిండెన్బర్గ్పై చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. అయినప్పటికీ అదానీ గ్రూప్ షేర్ల పతనం నేడు శుక్రవారమూ కొనసాగింది. మొత్తం10 నమోదిత సంస్థల్లో 7 కం పెనీల షేర్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. దీంతో రెండు వరుస సెషన్లలో అదానీ కంపెనీల మార్కెట్ క్యా పిటలైజేషన్ రూ. 4 లక్షల కోట్లకు పైగా కరిగిపోయింది. అని తాజా వార్తల కధనం..
