సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో ఆదాయ పన్ను రిటర్న్ లు దాఖలు చేసేవారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన రిటర్ను లను ఏప్రిల్ 1 నుంచే సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. 2023-24 ఆడిటింగ్ సంవత్సరం ప్రారంభం రోజు నుంచే సంబంధిత ఫారాలు అందుబాటులో ఉంటాయని సీబీడీటీ ప్రకటించింది. వ్యక్తులు, వృత్తి నిపుణులు, వ్యాపార సంస్థలు దాఖలు చేయాల్సిన 1-6 వరకు ఐటీఆర్ ఫారాలను సీబీడీటీ ఇప్పటికే నోటిఫై చేసింది. అసెస్మెం ట్ ఇయర్ ప్రారంభం నుంచే రిటర్నులు దాఖలు చేయడం వల్ల, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. జులై 31లోగ రిటర్నులు దాఖలు చెయ్యవలసి ఉంటుంది.
