సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ , పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘ఆది‌పురుష్’ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ‘ఆదిపురుష్’ ను ట్రోల్ చేస్తూ నెట్టింట అనేక మంది పోస్ట్‌లు పెట్టారు. విజువల్ ఎఫెక్ట్స్ ఆశించిన స్థాయిలో లేవన్నారు. ప్రభాస్ కు మంచి స్నేహితుడు .. మా ప్రెసిడెంట్ ,టాలీవుడ్ హీరో మంచు విష్ణు తాజాగా ఈ టీజర్‌పై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఆదిపురుష్ టీజర్‌ను చూడగానే ప్రేక్షకులను మోసం చేసినట్టు అనిపించిందని ప్రకటించాడు. ప్రభాస్, సైఫ్ అలీఖాన్‌లు నటిస్తున్నప్పుడు ప్రేక్షకులు యాక్షన్‌ను ఆశిస్తారన్నాడు. మేకర్స్ ముందుగానే ప్రేక్షకులను ప్రిపేర్ చేసి ఉంచితే బాగుండేదని చెప్పాడు. ‘‘నేను ఓ తెలుగు వ్యక్తి మీద నా అభిప్రాయాన్ని చెబుతున్నాను. లైవ్, యాక్షన్‌గా రామాయణాన్ని రూపొందిస్తున్నారని మేం అందరం అనుకున్నాం. యానిమేషన్ చిత్రాన్ని ఎవరూ ఊహించలేదు. అందువల్ల ప్రతి ఒక్కరు నిరుత్సాహపడ్డారు. మేకర్స్ ముందుగా యానిమేటెడ్ సినిమాను రూపొందిస్తున్నామని చెప్పి, టీజర్‌ను విడుదల చేస్తే జీరో ట్రోల్స్ వచ్చేవి. ప్రేక్షకులను ప్రిపేర్ చేయకుండా, మోసం చేస్తే ఈ విధంగానే స్పందిస్తారు. ‘తానాజీ’ కి దర్శకత్వం వహించిన ఓం రౌత్ వల్ల కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆకస్మాత్తుగా మేకర్స్ వచ్చి యానిమేషన్ చిత్రాన్ని చూపిస్తే ప్రేక్షకులు ఈ విధంగానే స్పందిస్తారు ’’ అని మంచు విష్ణు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *