సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యా ప్తంగా విడుదల కానుంది. కాగా జూన్ 7 నుంచి 18 వరకు అమెరికాలో జరిగే ట్రిబెకా ఫెస్టివల్లో భాగంగా జూన్ 13న ‘ఆదిపురుష్’ చిత్రం వరల్డ్ ప్రీమియర్‌ని (త్రీడీ) ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మన భారతీయ చిత్రాలను ఇతర దేశాల్లోచూడటం , ముఖ్యం గా ‘ఆదిపురుష్’ ప్రపంచ స్థాయికి చేరుకోవడం ఒక నటుడిగానే కాకుండా భారతీయుడిగా గర్వంగా ఉంది ‘‘న్యూ యార్క్ లోని ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఆదిపురుష్’ చిత్రం వరల్డ్ ప్రీమియర్‌ను ప్రదర్శించనుండటం గర్వంగా ఉం ది. మన దేశ నైతికతకు అద్దం పట్టే ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టం ’’ అన్నారు ప్రభాస్. ఓం రావత్ దర్శకత్వంలో 400 కోట్ల భారీ బడ్జెట్ తో .. టి సిరీస్ భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో కృతీ సనన్, సైఫ్ అలీఖాన్ , సన్నీ సింగ్ నటించారు. సుమారు 3 గంటల నిడివిగల ఈ సినిమాకు ఇటీవల మరింత క్వాలిటీతో గ్రాఫిక్స్ అందించడం జరిగిందని తెలుస్తుంది.
