సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ ప్రభాస్ హీరోగా ఆల్ టైం రియల్ హీరో శ్రీ రామచంద్రుని పాత్రలో ఆదిపురుష్ సినిమా ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా ఏ భారతీయ సినిమా విడుదల చెయ్యని రీతిలో వేలాది థియేటర్స్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ లో భాగం తిరుమల శ్రీవారి అస్సిసులతో తిరుపతి లో రేపు మంగళవారం బ్రహ్మాండమైన ప్రీ రిలీజ్ వేడుకను కోట్ల ఖర్చుతో ప్రతిష్టాకరంగా చేస్తున్నారు. అందరికీ తెలిసిన రామాయణం తీయటం అంటే మాటలు కాదు, ఇప్పటి తరానికి శ్రీరాముని తత్వం ఆదర్శం చేసేవిధంగా సినిమా తీశామంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు ప్రసిద్ధి చెందిన మత గురువు చిన జీయర్ స్వామి హాజరు అవుతున్నారు. ఆయన శ్రీరామునిగా ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. తిరుపతిలో అయోధ్య యొక్క భారీ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. లక్షమంది వస్తారని అంచనా.. ఇక ఈ ఈవెంట్ మొత్తానికి భీమవరం యూత్ బ్రాండ్ , వినూత్న సినిమాల దర్శకుడు ,హనుమాన్ లాంటి ఫాంటసీ సినిమా తీస్తున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించడం మరో విశేషము. ఈ వేడుకలో ‘ఆదిపురుష్’ లో రామాయణం పాటలకి ఈ ఈవెంట్లో 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు. దేశం లో అన్ని ప్రముఖ ఛానెల్స్ లో ఈ వేడుకను లైవ్ లో కోట్ల మంది భారతీయులు చూడనున్నారు.
