సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ శ్రీరామ చంద్రుడి పాత్రలో నటించిన 400 కోట్ల భారీ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్రకటించినప్పటికీ అనుకోని కారణాల వల్ల వాయిదాపడినట్లు ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం. . ఎందుకంటే మొన్న టీజర్ లో సినిమా మరి నాసిరకం గ్రాఫిక్స్ వాడినట్లు, యానిమేషన్ కూడా సరిగా లేదని వచ్చిన విమర్శలపై, ప్రభాస్ కూడా అసంతృప్తి తో ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇక ఆధునిక టెక్నికల్ అం శాలపై దృ ష్టి పెట్టిందని.. కొన్ని పాత్రల గెటప్ లలో కూడా పండితులు సూచించిన మార్పులు ఉంటాయని, దీనికోసం ఏకం గా రూ.100 కోట్లు ఖర్చు పెట్టి మరోసారి వీఎఫ్ఎక్స్ , సీజీ పనులు చేయిస్తోందని బాలీవుడ్ టాక్..
