సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు తాజా శుభవార్త ఏమిటంటే.. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ(SEBI) మ్యూచువల్ ఫండ్ KYC నిబంధనలను ఇటీవల మార్పులు చేసింది. దీంతో కోటి మందికి పైగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల ‘కేవైసీ రిజిస్ట్రేషన్’ కోసం పాన్‌ను ఆధార్‌తో (pan aadhar link) లింక్ చేయడాన్ని సెబీ తప్పనిసరి చేసింది. కానీ ప్రస్తుతం జారీ చేసిన కొత్త సర్క్యులర్‌లో కేవైసీ రిజిస్ట్రేషన్‌కు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి కాదని సెబీ స్పష్టం చేసింది. అక్టోబర్‌లో ఆధార్, పాస్‌పోర్ట్ లేదా ఓటరు ID వంటి “అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రాల ద్వారా చేయని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులందరినీ మార్చి 31 లోపు వారి KYCని మళ్లీ అప్డేట్ చేయాలని సెబీ కోరింది. గతంలో పాన్, ఆధార్‌ను లింక్ చేయకపోతే వారి KYC ఆగిపోయేది. కానీ ఇప్పుడు ఆధార్, పాన్ లింక్ చేయకున్నా కూడా వారి ఆధార్ ఆధారిత KYCని నమోదు చేసుకోవచ్చును

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *