సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం సమీపంలో ఉన్న పేరు పాలెం సముద్ర తీరంలో సతీష్ అనే తాపీమేస్త్రి తాను సూసైడ్ చేసుకొంటునట్లు ప్రకటించి సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. సతీష్ తీవ్ర మనోవేదనతో మాట్లాడుతూ.. ఒరేయ్ తమ్మడు చనిపోతున్నా అంటూ .. ఆన్ లైన్ బెట్టింగ్ వేసి మొత్తం నాశనం చేశాను ఇక ఏం చేయాలో అర్థం కావడం లేదు, బెట్టింగ్ మానుకోలేకపోతున్నను, మీ అందరిని బాధ పెట్టాను, ఇక, నేను బ్రతికుండడం అనవసరం పిల్లలు జాగ్రత్త ఐయామ్ సారీ అంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి బంధువులకు పంపిన సతీష్, అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యడంతో సముద్ర తీరంలో అతని ఆచూకీ కోసం పేరుపాలెం బీచ్ లో మొగల్తూరు పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. నేటి మధ్యాహ్నం వరకు బీచ్ లో ఎక్కడ సతీష్ ఆచూకీ లభ్యం కాలేదు. వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
