సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి అకస్మాత్తుగా పతాక స్థాయికి చేరాయి. నేడు ఆదివారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) యుద్ధవిమానాలు ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ ఆకస్మిక వైమానిక దాడుల్లోఅనేక కుటుంబాలు మహిళలు, పిల్లలతో సహా పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ దేశంలో ఇటీవల భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పాకిస్థాన్ జనరల్స్ ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. దీనికి తగిన ప్రతి చర్య ఉంటుందని తగిన బుడ్డి చెపుతామని హెచ్చరించారు. మరోవైపు, పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ ఈ దాడులను సమర్థించుకున్నారు. తమ దేశంలో పెరుగుతున్న ఉగ్రదాడులకు కారణమవుతున్న పాకిస్థానీ తాలిబన్’ (TTP) స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేశామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *