సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న సోమవారం ఆప్ఘనిస్తాన్ లో ఏర్పడిన భారీ భూకంపం కుదిపేసింది. ఇంతవరకు 802 మంది మరణించగా, 2,800 మంది గాయపడ్డారని సోమవారం అధికారవర్గాలు తెలిపాయి.అయితే ఈ ప్రాంతంలో మట్టితో నిర్మించిన ఇళ్లే అధికం కావడంతో మృతుల సంఖ్యా 1000? ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మారుమూల పర్వత ప్రాంతాల్లో భూకంపం సంభవించడం, అక్కడ తెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తుండడం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో సహాయ బృందాలు వెళ్లడం కష్టంగా మారింది. రెక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 6.0 పాయింట్లుగా రికార్డయింది. అనంతరం గత రాత్రంతా అయిదుసార్లు భూమి కంపించింది. కునార్ ప్రావిన్స్‌లో మొత్తం మూడు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయాయి. ఆప్ఘనిస్తాన్ సైన్యమే విమానాల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తోంది. 40 విమానాలు సేవలు అందిస్తున్నాయని, ఇంతవరకు 420 మంది క్షతగాత్రులను తరలించినట్టు సైన్యం ప్రకటించింది. నష్టం అధికంగా ఉండడంతో ఆదుకోవాలని తాలిబన్ ప్రభుత్వం అన్ని దేశాలను కోరింది. భారత ప్రధాని మోడీ ఆఫ్గనిస్తాన్ ప్రజలను అదుకొంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే వైద్య సహాయం అందజేస్తున్నారు.
