సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదం మరోసారి విలయతాండవం చేసింది. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ముష్కరులు దాడిలో ఏకంగా 100 మంది చిన్నారులను పొట్టనపెట్టుకున్నారు.ఇంతమంది పిల్లలను పొట్టన పెట్టుకొన్న ఉగ్రవాదులను పుట్టించిన దేవుడు కూడా సిగ్గుపడతాడు ఈ రోజు.. రాజధాని కాబూల్‌లోని ఓ స్కూల్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 100 మంది మృత్యువాత పడినట్టు చెబుతున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది హజారాలు, షియాలేనని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో హజరాస్‌ది మూడో అతిపెద్ద కమ్యూనిటీ. ఆప్ఘనిస్తాన్ ను అర్ధాంతరంగా వారి కర్మకు వదిలేసి వెళ్లి పోయిన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు అన్ని ఈ చర్యను ఖండిస్తున్నాయి. నిజంగా చదువుకోవడానికి వెళ్లిన పిల్లలపై ఇటువంటి దారుణం జరగడం ఆ చిన్నారులను కోల్పోయిన తల్లి తండ్రుల ఘోష ఆపడం ఎవరి తరం..ప్రపంచంలో మనిషి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరు చలించిపోవలసిందే…
