సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు నేడు, ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక పత్రికలో.. తాను, చిత్తూరు జిల్లా జనసేన నేతలను ఉద్దేశించి.. గతం మర్చిపొండి .. టీడీపీ పార్టీ కష్టంలో ఉంది.. ఇక పవన్ మాత్రమే సీఎం అవుతారు ఇక జనసేన నేతలు చెప్పినట్లు టీడీపీ వారు వింటారు అని చెప్పినట్లు వైరల్ అవుతున్న వార్త ను ఖండించారు. పవన్ తిరుపతి నుండి పోటీ చేస్తారని తాను ప్రకటించినట్లు ప్రచారంలో ఉన్న వార్త కూడా తప్పే నని అన్నారు. పవన్ ఎక్కడ పోటీచేయ్యాలో ఆ పత్రిక నాపేరు తో ప్రకటించేస్తుందా? అని ప్రశ్నించారు. జగన్ సర్కార్ చంద్రబాబును కారణం లేకుండా జైళ్లో పెట్టారు. టీడీపీకి, జైలు లో ఉన్న చంద్రబాబుకు సపోర్టుగా మేము మీకు ఉన్నాం. ఆయనపైన కేసులు పడ్డాయి అని చంకలు గుద్దుకునే పరిస్థితి మాకు లేదు. జనసేనలోని 90 శాతం మంది చంద్రబాబు పట్ల, పొత్తు పట్ల పాజిటీవ్ గానే ఉన్నారు. ప్రజాస్వామ్య అందరూ ఒకే నిర్ణయానికి రావాలని లేదు. ఎంత గొప్పవారు తీసుకున్న నిర్ణయంలోనైనా కొంత వ్యతిరేఖత ఉంటుంది. అది జనసేన లోను ఉండవచ్చు అయితే దాన్ని మేము పరిగణలోకి తీసుకోవటం లేదు. బిజెపి నుంచి త్వరలో నిర్ణయం వస్తుంది. ప్యాకేజీ అంటే చెప్పుతీసుకుని కొడతాం. త్వరలో రాయలసీమలో వారాహీ యాత్ర చాలా స్ర్టాంగ్ గా ఉంటుంది. అని నాగబాబు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *