సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవిని వైసిపి అభ్యర్థిగా బరిలో దింపుతారని విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ ఎవరు ఊహించని రీతిలో భీమవరం పట్టణానికి చెందిన బీసీ వర్గానికి చెందిన గూడూరి ఉమాబాలను బరిలోకి దింపుతున్న నేపథ్యంలో తొలిసారి ప్రస్తుత నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామా కృష్ణంరాజు తొలిసారిగా ఢిల్లీలో నేడు, సోమవారం స్వాందించారు . బీజేపీ పొత్తుకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈసారి టీడీపీ-జనసేన మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని భావిస్తున్నారు. ఎంపీ రఘురామా ఢిల్లీలో మీడియతో మాట్లాడుతూ.. గతంలో నాపై పోటీకి రోజుకొక అభ్యర్థి పేరు చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ నాయకురాలు ఉమాబాలను నాపై పోటీకి నిలబెడతామని అంటున్నారు. ఆమెతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు.కానీ.. నేను సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే శత్రువును’ అని రఘురామ అన్నారు. దీనికి ఏదో మహిళ.. పక్షపాత మహిళ అభ్యుదయ కోసం చేశారని జగన్ అనడం భావ్యం కాదని, జగన్మోహన్ రెడ్డి పూలే, కందుకూరి వీరేశలింగం లా ఫీల్ అవ్వొద్దని.. జగన్ ముందు తన సొంత చెల్లెలను, తిట్టించడం మానేయాలని, కుటుంబసభ్యులకు మర్యాద ఇవ్వాలని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
